ఇంజనీర్స్ డే సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

భారతదేశపు మహోన్నత ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే సందర్భంగా పొన్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, ఆయన ఆదర్శాలు, దేశ సేవకు సంబంధించిన అంశాలతో ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.జనగామలోని సీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వగ్రామమైన ఖిలాషాపూర్‌లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు విశ్వేశ్వరయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ఎండీ మాజిద్, తుంగ సతీష్, సీజేఐటీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, పొన్నాల ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...