మెదక్ మెడికల్ కాలేజీలో 156 ఉద్యోగాలు
- గురుకుల అడ్మిషన్ల పేరుతో వసూళ్లు? - August 13, 2026
- వాయిదాల పర్వంతోముగిసిన పార్లమెంటు సమావేశాలు - August 13, 2026
- ప్రభుత్వ భూములు అమ్మకాలకేనా? - August 13, 2026

మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నితిన్ కాబ్ర తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో 4 ప్రొఫెసర్లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్లు, 6 సీనియర్ రెసిడెంట్లు, 3 ట్యూటర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోస్టులకు ఆగస్టు 13 నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా మెడికల్ కాలేజీలో పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి కూడా దరఖాస్తులు కోరుతున్నట్లు వెల్లడించారు. మొత్తం 156 పోస్టులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఔట్‌సోర్సింగ్ పోస్టుల్లో అనస్థీషియా టెక్నీషియన్ 8, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 1, ఆడియో విజువల్ టెక్నీషియన్ 1, బార్బర్ 6, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ 3, కార్పెంటర్ 1, క్యాటలాగర్ 1, చైల్డ్ సైకాలజిస్ట్ 1, సీటీ టెక్నీషియన్ 4, డేటా ఎంట్రీ ఆపరేటర్ 37, డెంటల్ టెక్నీషియన్ 1, దోబీ/ప్యాకర్ 6, ఈసీజీ టెక్నీషియన్ 4, ఎలక్ట్రీషియన్ 6, గ్యాస్ ఆపరేటర్ 4, ల్యాబ్ అటెండర్ 19, మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ 1, ఆఫీస్ సబార్డినేట్ 24, ప్లంబర్ 2, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ 1, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 7, రేడియాలజీ టెక్నీషియన్ 1, రికార్డు క్లర్క్/రికార్డు అసిస్టెంట్ 2, రిఫ్రాక్షన్ ఆప్టిషియన్ 1, స్పీచ్ థెరపీ 1, టైలర్ 1, థియేటర్ అసిస్టెంట్ 2, ఓటీ టెక్నీషియన్/అనస్థీషియా 10 పోస్టులు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఔట్‌సోర్సింగ్ పోస్టులకు ఆగస్టు 13 ఉదయం 11 గంటల నుంచి ఆగస్టు 20 మధ్యాహ్నం 3 గంటల వరకు మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలను పరిశీలించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు ఫారం, పోస్టుల వారీగా విద్యార్హతలు, ఇతర మార్గదర్శకాలు మరియు పూర్తి వివరాల కోసం మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అధికారిక వెబ్‌సైట్ gmcmedak.orgను సందర్శించాలని అధికారులు సూచించారు. కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం అందుబాటులో ఉన్నట్లు కూడా వెల్లడైంది.
