పీజీ సీట్ల కేటాయింపు ప్రారంభం.. నిర్లక్ష్యం చేస్తే సీటు గల్లంతే!
- ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్‌రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026
- యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం - August 4, 2026

హైదరాబాద్, ఆగస్టు 4 (జ్ఞాన తెలంగాణ):
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన పీజీ కోర్సుల ప్రవేశాల తొలి దశ సీట్ల కేటాయింపును రేపటి నుంచి మూడు విడతల్లో విడుదల చేయనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్లైన్ స్వీయ రిపోర్టింగ్‌తో పాటు సంబంధిత కళాశాలలో తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు స్పష్టం చేశారు.
గడువులను నిర్లక్ష్యం చేసిన విద్యార్థులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని, సీటు స్వయంచాలకంగా రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆలస్యం, నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన కారణంగా భవిష్యత్తులో అడ్మిషన్ కోల్పోయినా అధికారులు బాధ్యత వహించరని స్పష్టం చేశారు.
విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ కేటాయింపు వివరాలు పరిశీలించి, అవసరమైన ధ్రువపత్రాలతో వెంటనే ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఒక్క నిర్లక్ష్యం.. ఏడాది శ్రమను వృథా చేసే ప్రమాదం ఉందని, ప్రతి విద్యార్థి అప్రమత్తంగా వ్యవహరించాలని ఉన్నత విద్యామండలి సూచించింది.
