ప్రజల విశ్వాసానికి నిలువెత్తు చిరునామా…సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి..
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 02:
ప్రజలకు ప్రతి ఆపద సమయంలో అండగా నిలుస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా విశ్వాసాన్ని చూరగొంటున్న,
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,టాస్క్- సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని ఆదివారం ఆమనగల్ పట్టణంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు,ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిసి తమ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన వినతిపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న వివిధ సామాజిక అవసరాలు,పేద కుటుంబాల ఇబ్బందులు, విద్య,వైద్య సహాయం, అత్యవసర ఆర్థిక సహాయం, గ్రామాభివృద్ధికి సంబంధించిన త్రాగునీటి వాటర్ ప్లాంట్ల నిర్మాణాలు, దేవాలయాల అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి దృష్టికి తీసుకువచ్చి తన సహకారంతో గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు.ప్రజల వినతులను స్వీకరించిన ఆయన సమస్యల స్వరూపాన్ని తెలుసుకుని,సాధ్యమైనంత మేరకు తన సొంత నిధులతో పాటు ఐక్యత ఫౌండేషన్ ద్వారా సహాయం అందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారానికి నా వంతు చేయూత అందించడమే నా బాధ్యత, ప్రతి సమస్యకు సాధ్యమైన పరిష్కారం చూపడమే నా ధ్యేయం అన్నారు.అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో..
పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు,యువకులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
