Daily Archive: November 6, 2026
తాడ్వాయి: మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో కొత్త లావణ్య (42) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సంతానం లేకపోవడంతో రాజమల్లయ్య దంపతులు 12 ఏళ్ల క్రితం రాజును దత్తత తీసుకున్నారు. రాజు రెండేళ్లుగా ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజు భార్య లావణ్యకు కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గురువారం రాత్రి కూడా గొడవ జరగగా కుటుంబ సభ్యులు నచ్చజెప్పారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లావణ్య…
తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో KYCS నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు శీతపల్లి అనిల్ కురుమ ఆధ్వర్యంలో నవంబర్ 5న నిర్వహించిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు చెట్కూరి రజినీకాంత్ కురుమ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంబళ్ల సాయినిఖిల్ కురుమ, వ్యవస్థాపకులు చెట్టి భాస్కర్ కురుమ తదితరులు హాజరయ్యారు. కురుమ కుల ఐక్యత, సామాజిక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అధ్యక్షుడిగా బుయ్య భాను ప్రసాద్ కురుమ, ప్రధాన కార్యదర్శిగా…
కామారెడ్డి, నవంబర్ 6: జిల్లాలో విద్యాశాఖలో కొనసాగుతున్న అక్రమ డిప్యూటేషన్లపై సమగ్ర విచారణ జరిపి, వాటిని తక్షణమే రద్దు చేయాలని AISA రాష్ట్ర కో-కన్వీనర్ జీవియం విఠల్ డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లించి స్థానిక పాఠశాలల్లో డిప్యూటేషన్లు పొందుతున్న ఉపాధ్యాయుల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సిబ్బంది అధికారులుగా చలామణి అవుతున్నారని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నారాయణ, చైతన్య…
నాలుగేళ్ల తర్వాత న్యాయమే గెలిచింది
వెల్దండ నవంబర్ 06:కల్వకుర్తి నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడిగా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన జక్కుల చిన్న జంగయ్య యాదవ్‌ను నియమించేందుకు జిల్లా యాదవ సంఘం పెద్దలు నిర్ణయించారు.ఈ మేరకు శనివారం (నవంబర్ 7) ఉదయం 10:30 గంటలకు కల్వకుర్తిలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి వెల్దండ మండలంలోని యాదవ కుల బంధువులు,సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై జక్కుల చిన్న జంగయ్య యాదవ్‌కు మద్దతు తెలపాలని నిర్వాహకులు కోరారు.
వెల్దండ నవంబర్ 06: వెల్దండ మండలం కొట్ర తండా ప్రధాన కూడలిలో గురువారం రాత్రి పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. సీఐ రఘువీర్ రెడ్డి, ఇన్చార్జి ఎస్సై వీరబాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.ఈ సందర్భంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ ప్లేట్లు, హెల్మెట్, సీట్ బెల్ట్ తదితర అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.అనుమానాస్పద వాహనాలను ఆపి తనిఖీ చేశారు.రోడ్డు భద్రతా చర్యలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సీఐ రఘువీర్ రెడ్డి హెచ్చరించారు….
వెల్దండ నవంబర్ 06: ఎస్సీ సంక్షేమ పథకాల సాధన కోసం నిర్వహించనున్న ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాదిగ ఆధ్వర్యంలో వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఈదులపల్లి జంగయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు తాండ్ర బాలు, ఉపాధ్యక్షుడు దూల రామస్వామి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ నవంబర్ 06:వెల్దండ సింగిల్ విండో నూతన చైర్మన్‌గా ఎంపికైన ఎన్నం భూపతిరెడ్డిని పోతేపల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో పోతేపల్లి మాజీ ఎంపీటీసీ కాడు రాంనాయక్, సర్పంచ్ గన్య నాయక్, మెల్కేడి రాజు,అరుణ్ నాయక్,కుమార్ నాయక్,తానేష్ యాదవ్, మల్లేష్ యాదవ్,మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎన్నం భూపతిరెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం…
వెల్దండ నవంబర్ 06: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) కింద తర్నికంటి లింగమయ్య కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 వేల ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాలో జమైంది. ఈ సందర్భంగా పోతేపల్లి గ్రామ సర్పంచ్,తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి తగుళ్ల కొండలు యాదవ్ మాట్లాడారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,యువ నాయకులు వావిళ్ళ యాదగిరి, ఎగిరిశెట్టి శివ,మార్కండేయుడు, బాలు…
వెల్దండ నవంబర్ 06: వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన శ్రీను యాదవ్ కుమార్తె మేఘన వివాహ ఖర్చుల నిమిత్తం రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు.ఆర్థిక ఇబ్బందులను గ్రామ బీఆర్ఎస్ నాయకుల ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వివాహ ఖర్చుల కోసం ఈ సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముక్తల శేఖర్, అజిలాపూర్…