జీఎస్ఐలో హాస్టల్, ల్యాబ్ ప్రారంభం

 ఖనిజ అన్వేషణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) శిక్షణ సంస్థలో నూతన సాంకేతిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. జీఎస్ఐ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ హాస్టల్, అత్యాధునిక జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ, ‘కర్మయోగి’ డిజిటల్ స్టూడియోలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర…