సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
- రోడ్డు ప్రమాద బాధితుడికి గోలి సాయం - August 12, 2026
- ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి - August 12, 2026
- డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి సాయి చైతన్య - August 12, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12:
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో బుధవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసలో మర్యాదపూర్వకంగా కలిసి, కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు సమర్పించారు.ముఖ్యంగా ఆమనగల్, కల్వకుర్తి మున్సిపాలిటీలకు సీసీ రోడ్లు మరియు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ యు.జి.డి పనుల కోసం మొత్తం రూ.80 కోట్ల నిధులు ఆమనగల్‌కు రూ.30 కోట్లు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు.కల్వకుర్తి నియోజకవర్గంలో పేదలు, లంబాడీలు అధిక శాతం కావున నిరుపేద కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కోరానని ఆయన తెలిపారు.ఎమ్మెల్యే ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
