మహాలింగాపురం క్రేన్ ప్రమాదం
ప్రశ్నల మబ్బులో నిజం ఎక్కడ?

మహాలింగాపురం క్రేన్ ప్రమాదం
ప్రశ్నల మబ్బులో నిజం ఎక్కడ?



– గాలివేగం వాదనపై అనుమానాల వెల్లువ
– సాంకేతిక వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నమా?
– శోధన ప్రక్రియపై సందేహాలు
– కార్మికుల లెక్కలపై అనుమానాలు
– రాత్రి గేట్లు మూసివేత వెనుక గూఢార్థం
– మీడియాను అడ్డుకుని రాత్రంతా సంస్థలో ఏం జరిగింది?


జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :
మహాలింగాపురం NCC కన్స్ట్రక్షన్ కంపెనీలో జరిగిన ఈ క్రేన్ ప్రమాదం నిజంగా ప్రకృతి వైపరీత్యమేనా? 27వ తేదీ మధ్యాహ్నం వీచిన గాలికి మాత్రమే 106 టన్నుల రెండు క్రేన్లు కూలిపోయాయా? అదే ప్రాంగణంలో ఉన్న షెడ్లు, చెట్లు, ఇతర క్రేన్లు ఎటువంటి ప్రభావం లేకుండా ఉండగా ఈ రెండు భారీ యంత్రాలు మాత్రమే ఎలా కూలిపోయాయి? గాలి కారణమా లేక సాంకేతిక లోపాన్ని గాలికి మోపే ప్రయత్నమా? మొత్తం 212 టన్నుల క్రేన్ కూలిన ఘటనలో కేవలం కుడి భాగం కిందనుంచే 16 మంది కార్మికులను వెలికితీసి, ఎడమ భాగం పూర్తిగా పరిశీలించకుండానే “ఇంకెవరూ లేరు” అని ఎలా నిర్ధారించారు? ఎడమ భాగం కింద మరెవరైనా చిక్కుకుని ఉన్న అవకాశాన్ని ఎందుకు పూర్తిగా పరిశీలించలేదు? యాజమాన్యం తెలిపిన 16 మంది లెక్క నిజమేనా? వందలాది మంది పనిచేస్తున్న ప్రాంగణంలో ప్రమాదం తర్వాత కేవలం 50 మంది మాత్రమే ఎందుకు కనిపించారు? మిగతా కార్మికులను ఎక్కడికి తరలించారు? రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు గేట్లు మూసివేసి మీడియాను ఎందుకు లోనికి అనుమతించలేదు? ఆ సమయంలో భారీ క్రేన్లతో ఎడమ భాగం కింద ఉన్న శవాలను రహస్యంగా తొలగించారా? గ్రామస్తులను కూడా బయటకు పంపించి రాత్రంతా సంస్థలో ఏం జరిగింది? నిరసనలు అరికట్టేందుకు కార్మికులను వాహనాల్లో తరలించారా? ఈ ఘటన వెనుక నిజం ఏమిటి? పూర్తి స్థాయి దర్యాప్తు జరగకపోతే బాధితుల గోడు ఎవరు వినాలి?

You may also like...

Translate »