యమపాశమైన ఈవీ చార్జర్.. యువకుడు బలి
వెల్దండ, అక్టోబర్ 21: పండుగ పూట కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.వెల్దండ మండలంలోని ఉప్పలగట్టు గ్రామ పంచాయతీ జాన్లగట్టు తండాకు చెందిన వడ్త్యావత్ దేవేందర్ (29) మంగళవారం ఉదయం 11 గంటలకు తన సోదరుని ఈవీ కార్ ఛార్జింగ్ పెట్టి ఉండగా, కారు డోర్ తీస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.ఈ ఘటనలో ఆయన భార్యకు సైతం విద్యుత్ షాక్ తగిలి స్వల్ప గాయాలతో…
