సీపీఎస్ ఉద్యోగుల నిరసనకు టీఆర్‌టీఎఫ్ మద్దతు

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి,వెబ్ డెస్క్: నవంబర్ 17న టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో చేపట్టనున్న సామూహిక సెలవు కార్యక్రమానికి టీఆర్‌టీఎఫ్ రంగారెడ్డి జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఓపీఎస్ పునరుద్ధరించాలని జిల్లా అధ్యక్షుడు యం. రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుషాల్ జామ డిమాండ్ చేశారు. జిల్లా, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

You may also like...