జీరో ఫాటాలిటీ డిస్ట్రిక్ట్ (ZFD) కార్యక్రమంలో భాగంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు, చెర్లపల్లి బస్స్టాండ్ జంక్షన్ వద్ద ప్రమాదకర ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. రోడ్ సేఫ్టీ డీసీపీ ఏ. లక్ష్మి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్, ఆర్టీఏ, మున్సిపల్, రోడ్డు భద్రతా విభాగాల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రహదారుల విస్తరణ, ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, జంక్షన్ల అభివృద్ధి, పాదచారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను గుర్తించారు. సంబంధిత శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నారు.