రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ 291వ డివిజన్ కళావతి నగర్‌లో అభివృద్ధి పనులకు మరో ముందడుగు పడింది. బస్తీలోని స్మశాన వాటిక పక్క నుంచి కమిటీ హాల్ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే బొందలగడ్డ అభివృద్ధికి రూ.150 లక్షలు, పాఠశాల సమీప రోడ్లకు రూ.42.50 లక్షలు కేటాయించడంతో పాటు స్మశాన వాటిక పునర్నిర్మాణం, మహిళా భవన్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని 291వ డివిజన్ నాయకుడు కూన రాఘవేందర్ గౌడ్ తెలిపారు. సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...