రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) చిలుకానగర్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని చిలుకానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ములకలపల్లి రాజేష్ ముదిరాజ్ కోరారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తాను కలిసి డివిజన్లో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
- ఈ సందర్భంగా రాజేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. చిలుకానగర్ డివిజన్లోని శ్మశానవాటికలో జరుగుతున్న అభివృద్ధి పనుల సందర్భంగా కొన్ని పాత సమాధులను సంబంధిత కాంట్రాక్టర్ ధ్వంసం చేస్తున్న విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఎలాంటి నష్టం కలగకుండా నిబంధనల ప్రకారమే పనులు చేపట్టాలని కోరినట్లు వెల్లడించారు.దీనిపై స్పందించిన జోనల్ కమిషనర్ రాధిక గుప్తా సంబంధిత అధికారులతో మాట్లాడి, కాంట్రాక్టర్కు తగిన సూచనలు చేశారు. డివిజన్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాణ్యతతో కూడిన మౌలిక వసతులు కల్పించాలని రాజేష్ ముదిరాజ్ కోరారు.
