విదేశీ విద్యకు ప్రభుత్వఆర్థిక సాయం

హైదరాబాద్విద్యకు మాత్రమే సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ అన్నారు.
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశీ విద్యకు అర్హత సాధించిన రౌలకోల వంశీకి ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయంలో సంబంధిత పత్రాలను బండి రమేష్ విద్యార్థికి అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు తిరిగి మాతృభూమికి వచ్చి తమ సేవలను అందించాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పుష్పరెడ్డి, నాగార్జున, శ్రీనివాస్ బాబు, మస్తాన్ రెడ్డి, క్రాంతి, లక్ష్మయ్య, బాలరాజు, రమణ, ఆసిఫ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

You may also like...