రూ.2.10 కోట్లతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులతో కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత – తోటకూర వజ్రేష్ యాదవ్

మల్కాజిగిరి కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ రాంపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాంపల్లిలోని కాకతీయ డైమండ్ కాలనీ నుంచి తారక ఎన్‌క్లేవ్ కాలనీ వరకు సుమారు రూ.2 కోట్ల 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన డ్రైనేజీ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం డివిజన్ అధ్యక్షులు భూమయ్య యాదవ్,మాజీ నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి,డీసీసీ సెక్రెటరీ పంగ హరి బాబు,మాజీ కౌన్సిలర్ పంబాల రమేష్, పొట్ట శ్రీశైలం,పొట్ట విగ్నేష్,మంచాల ప్రవీణ్,పార్వతి రెడ్డి,జీవన్ రెడ్డి,బాలరాజ్ యాదవ్,మహేందర్ భోపతి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

You may also like...