రంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ బలవన్మరణం!
- రంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ బలవన్మరణం! - November 10, 2026
- పేదల ఇళ్లపై పాలకుల పంజా.. పోరుకు సిద్ధమైన బాధితులు! - November 9, 2026
- ఆర్ఎస్ఎస్కు సేవకులే బలం! - November 9, 2026

రంగారెడ్డి,వెబ్ డెస్క్: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడలో 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీను (31) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వివిధ ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా శ్రీను అప్పులు తీసుకున్నట్లు సమాచారం. రుణాలు తిరిగి చెల్లించాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా తీవ్రంగా వేధించినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మార్ఫింగ్ ఫొటోలను మొబైల్‌కు పంపి పరువు తీస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీను ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరణానికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోన్ యాప్‌ల వేధింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
