దళితులకు ఇచ్చిన హామీల అమలుకు ఎమ్మార్పీఎస్ డిమాండ్.. వెల్దండలో భారీ ర్యాలీ

1001344207.jpg

వెల్దండ,నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం వెల్దండ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ,రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలోని నల్లాల బావి నుంచి ప్రధాన కూడలిలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలకొండ యాదగిరి మాట్లాడుతూ మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అంబేద్కర్ అభయహస్తం పథకం కింద దళితులకు రూ.12 లక్షలు అందిస్తామన్న హామీని అమలు చేయాలని, జీవో నంబర్లు 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న దళితులకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దూళ్ల రామస్వామి,తాలూకా ఇన్‌చార్జి ఈదులపల్లి జంగయ్య,తాలూకా అధ్యక్షులు తాండ్ర బాలు,ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కొమ్ము వెంకటయ్య,కొయ్యల మల్లేష్, కొప్పు గిరి,సలహాదారు ఈదులపల్లి వెంకటయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...