సత్తూరి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం – జక్కుల చిన్న జంగయ్య యాదవ్ కు అభినందనల వెల్లువ

కల్వకుర్తి, నవంబర్ 7:కల్వకుర్తి తాలూకా యాదవ సంఘం అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన జక్కుల చిన్న జంగయ్య యాదవ్ ను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సత్తూరి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.కల్వకుర్తి ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంగయ్య యాదవ్ కు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సత్తూరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. జంగయ్య యాదవ్ కృషి, పట్టుదలకు యాదవ సంఘంలో దక్కిన అరుదైన గౌరవం ఇది. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి, ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం అని కొనియాడారు. యాదవ సంఘం ఐక్యతకు జంగయ్య కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బుడం జంగయ్య యాదవ్, ఆంజనేయులు యాదవ్, వావిళ్ళ మధు యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మల్లేష్ యాదవ్, జక్కుల మహేష్ యాదవ్, ముత్యాలు, రామకృష్ణ, అల్లే నరేష్, లస్కర్ వెంకటేష్, పకాడీ అల్లాజీ, శ్రీహరి, లక్ష్మయ్య, నాగరాజు, ఉప్పు రమేష్, సాయి, అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.1001337659.jpg

You may also like...