ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి
- ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి - November 6, 2026
- వెల్దండ మండల సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్యకు ఘన సన్మానం - November 5, 2026
- నాగర్కర్నూల్ దివ్యాంగ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే SRD నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు - November 2, 2026
కల్వకుర్తి నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పట్టభద్రులు అందరూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఈదులపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
శుక్రవారం ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకుని దరఖాస్తులను తాసిల్దార్ కార్తీక్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని, ప్రజాస్వామ్యంలో తమ వాణిని వినిపించాలని కోరారు. ఓటు నమోదుకు చివరి తేదీ లోపు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ మనీలా, సంజీవ్ యాదవ్, సింగల్ విండో డైరెక్టర్ పుల్లయ్య పాల్గొన్నారు.
