రెండేళ్ల నిరీక్షణకు తెర.. తాడ్వాయికి నూతన డిప్యూటీ తహశీల్దార్!
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
- తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - November 6, 2026
- తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - November 6, 2026
తాడ్వాయి మండల రెవెన్యూ కార్యాలయంలో గత రెండేళ్లకు పైగా ఖాళీగా ఉన్న డిప్యూటీ తహశీల్దార్ పోస్టు ఎట్టకేలకు భర్తీ అయింది. గ్రూప్-2 పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉద్యోగం సాధించిన శృతి గురువారం తాడ్వాయి మండల నూతన ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్న ఆమె, తహశీల్దార్ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రెండేళ్లుగా కీలక పోస్టు ఖాళీగా ఉండటంతో రెవెన్యూ సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
