బ్రహ్మాజీవాడి పాఠశాల భవన నిర్మాణానికి రూ.27.10 లక్షల నిధులు మంజూరు – ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
- తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - November 6, 2026
- తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - November 6, 2026
తాడ్వాయి: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక చొరవతో తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల భవన నిర్మాణానికి నాబార్డ్ (NABARD) పథకం కింద రూ.27.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రవీందర్ రావు,సర్పంచ్ అంజనాబాయి రఘుపతిరావు, ఉపసర్పంచ్ ఘాజీ రాజు, మండల పార్టీ అధ్యక్షులు బండారి సంజీవులు, సొసైటీ చైర్మన్లు సుధాకర్ రావు, వెంకటరెడ్డి, మరియు శ్యాంరావు, శ్రీకాంత్, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గడ్డం రాజు, అంజయ్య, రాజేందర్, వీరయ్య, రాజయ్య, శివాజీరావు, అశోక్ రావు, ప్రసాద్ రావు, రమేష్ రావు, బలవంతరావు తదితరులు పాల్గొన్నారు.
