గ్రామ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ
- నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డికి ఘన సన్మానం - September 24, 2026
- గ్రామ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ - September 24, 2026
- ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి అదన కలెక్టర్ – బి చెన్నయ్య - September 24, 2026
గ్రామాభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 24: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల (వీజీపీపీ) తయారీపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వి.బి.-జి. రామ్జి సిబ్బందికి సెప్టెంబర్ 24, 25 తేదీల్లో నాగర్కర్నూల్ ఐడీఓసీ భవనంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహిస్తున్నారు.గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనుల గుర్తింపు, మౌలిక వసతుల అంచనా, అభివృద్ధి లోటుపాట్ల విశ్లేషణ, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. నీటి భద్రత, మొక్కల పెంపకం, సహజ వనరుల అభివృద్ధి, కరువు నివారణ, జీవనోపాధికి తోడ్పడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించనున్నారు. జూన్ 2027 వరకు గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడమే శిక్షణ లక్ష్యమని డీఆర్డీఏ అధికారులు తెలిపారు.
