ఆపదలో అండగా మురళి కుటుంబానికి జోగయ్య ఆర్థిక భరోసా

ఆపదలో అండగా.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా

వెల్దండ, సెప్టెంబర్ 23: మండల కేంద్రానికి చెందిన దండుగుల నారయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల కన్యాకుమారి జోగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం తన వంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, మాజీ సర్పంచ్ గుద్దేటి ప్రభాకర్, వార్డు సభ్యులు శేఖర్, బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, జంగా చారి, గోపాల్ చారి, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.1001204238.jpg

You may also like...