గణనాథుని ఆశిస్సులు ప్రజలందరి పై ఉండాలి.. టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి
- బాలుడు అదృశ్యం – ఆందోళనలో తల్లి దండ్రులు - September 23, 2026
- గణనాథుని ఆశిస్సులు ప్రజలందరి పై ఉండాలి.. టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి - September 23, 2026
- అక్రమంగా 22 పశువులను తరలిస్తున్న వాహనాలు పట్టివేత - September 22, 2026
ఆమనగల్: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవచైతన్య కాలనీలోని పలు గణేష్ ఉత్సవ కమిటీలతో పాటు శివసేన యూత్, శ్రీ రామాంజనేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
