త్రిదలన్ యూత్ గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్

నాగర్ కర్నూల్ పట్టణంలో త్రిదలన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుడి మండపాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ గారు కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1001337950.jpg

ఈ సందర్భంగా గణనాథుడి ఆశీస్సులతో నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్ గారు, కౌన్సిలర్లు నజీమా కాజా ఖాన్ గారు, పడిగే శంకర్ గారు, అవాంచ మాధవి రాజు గారు, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు గారు, త్రిదలన్ యూత్ సభ్యులు, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గణపతి బప్పా మోరియా నినాదాలతో మండపం భక్తిమయంగా మారింది.

You may also like...