జూరాలకు నీటి విడుదలపై కర్ణాటకతో సంప్రదింపులు – సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల భేటీ
- ఆమనగల్లులో వినాయక మండపంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - September 22, 2026
- త్రిదలన్ యూత్ గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్ - September 22, 2026
- చారగొండ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ - September 22, 2026
జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల అంశంపై కర్ణాటక ప్రభుత్వంతో జరపనున్న సంప్రదింపుల నేపథ్యంలో తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

హైదరాబాద్ లోని డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి మరియు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక ప్రభుత్వంతో జరపాల్సిన సంప్రదింపులపై చర్చించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఇన్స్టాగ్రామ్ లో తెలిపారు.అనంతరం ఈ సాయంత్రం మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బెంగళూరుకు వెళ్లనున్నారు. అక్కడ ఆల్మట్టి – నారాయణపూర్ నుంచి జూరాలకు నీటి విడుదల అంశంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చించనున్నట్లు సమాచారం.
