అత్యవసర రక్త దానానికి 10 నిమిషాల్లోనే స్పందన

నాగర్‌కర్నూల్: అత్యవసరంగా ఓ నెగెటివ్ రక్తం అవసరమని యువజన రెడ్‌క్రాస్ జిల్లా కన్వీనర్ దామగట్ల కుమార్ ఇచ్చిన పిలుపుకు ఇద్దరు రక్తదాతలు కేవలం పది నిమిషాల్లో స్పందించారు. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసు, టిఫిన్ సెంటర్ వ్యాపారవేత్త చంద్రశేఖర్ వెంటనే ముందుకు వచ్చి రక్తనిధి కేంద్రానికి చేరుకుని రక్తదానం చేశారు. దీంతో అవసరమైన రెండు యూనిట్ల ఓ నెగెటివ్ రక్తం సమకూరింది.అత్యవసర సమయంలో ఇచ్చిన పిలుపుకు తక్షణమే స్పందించి రక్తదానం చేసిన ఇద్దరు దాతలను దామగట్ల కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవాభావం, సమయస్ఫూర్తి అభినందనీయమని పేర్కొన్నారు.1001200188.jpg

You may also like...