మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
- మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 16, 2026
- కంటోన్ పల్లి లో చేయూత పింఛన్ల ఆకస్మిక తనిఖీలు – రాష్ట్ర బృందం పరిశీలన - September 15, 2026
- శ్రీరాములు కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక సహాయం - September 15, 2026

వెల్దండ సెప్టెంబర్ 16 : వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హుటాహుటిన మృతుని నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అంతటితో ఆగకుండా మానవతా హృదయంతో మృతుని కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను, వార్డు సభ్యులు గుద్దేటి కిష్టాల్, పాలాది మల్లీశ్వరి, రంగనాథం, మారెపల్లి శ్రీను, మంజుల, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, దర్గయ్య, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ముట్ట భరత్ గౌడ్, ముట్ట మల్లేష్ గౌడ్, ఈదులపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్ ముట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ను స్థానికులు అభినందిస్తున్నారు.
