ఛలో ఖమ్మం విజయవంతం చేయాలి : ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి

ఛలో ఖమ్మం విజయవంతం చేయాలి : ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 15 : ఈ నెల 28 నుండి మూడు రోజుల పాటు ఖమ్మంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఈదులూరు గ్రామంలో కామ్రేడ్ బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు, పట్టాదారు పాస్పుస్తకాలు, రుణమాఫీ, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర సమస్యలపై సహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ప్రభుత్వ, పారెస్టు భూములతో పాటు మిగులు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో బూరుగు సత్తయ్య, పెరిక మల్లయ్య, సూరారం ముత్తయ్య, చింత అంజయ్య, పెరిక శ్రీను, సముద్రాల సైదమ్మ, శారద, రాములు, చంద్రయ్య, గంట మార్కెండయ్య, హుస్సేన్, వెంకన్న, మారయ్య, తదితరుతు పాల్గొన్నారు.1000345712.jpg

You may also like...