ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

కొమురంభీమ్: వినాయక చవితిని పురస్కరించుకుని మంగళవారం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గణనాథునికి తొలి పూజలు చేసి, జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విగ్రహాల తరలింపు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు ఎన్. వామనమూర్తి, అంజన్న, ఆర్ఎస్ఐ లవన్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...