ఉప్పల ట్రస్ట్ సహకారంతో ఆర్థిక సహాయం


జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07:


కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన నెంట వెంకటేష్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ మార్చాల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సునీత వెంకట్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కడల సంతోష మల్లేష్ , మాజీ ఉప సర్పంచ్ మదన్ మోహన్ రావు ,విజయ డైరీ అధ్యక్షుడు కంకల శ్రీశైలం , వార్డు సభ్యులు వట్టేపు కిషోర్,పెరుమాళ్ళ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

You may also like...