ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు -పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ౹౹శ్రీ.ఎనుముల రేవంత్ రెడ్డి  జన్మదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.హాజరై కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉజ్వల్ రెడ్డి  మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆయురారోగ్యాలతో, సంతోషంగా నిండు నూరేళ్లు జీవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహ్మద్ యునూస్,వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కండెం.నర్సింహులు,సీనియర్ నాయకులు పట్లోళ్ళ.శ్రీకాంత్ రెడ్డి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా మియా,కౌన్సిలర్లు జమిలాలొద్దిన్,రంగా అరుణ్ కుమార్,జహీంగిర్,వకీల్,హక్రం,నిజాం,మరియు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు  బర్కత్,డాక్టర్ చంద్రశేఖర్,మాధవఱ రెడ్డి,నవీద్,సమి,శ్రీనివాస్ నాయక్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...