చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : సర్పంచ్ శ్యామల
- కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం - September 11, 2026
- మంచినీటి సమస్యల తలెత్తకుండా చర్యలు : సర్పంచ్ ముక్కామల శ్యామల - September 11, 2026
- కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణ - September 11, 2026
కట్టంగూర్, సెప్టెంబర్ 10 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఎస్ జీఎఫ్ పాఠశాలల క్రీడలను ఎంఈఓ అంబటి అంజయ్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. విద్యార్థులు క్రీడా స్పూర్తితో పోటీల్లో పాల్గొని మండలానికి మంచి పేరుతేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పద్మ, వార్డు సభ్యులు సైదమ్మ, ఎస్ జీ ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ రాజ శేఖర్ రెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాస్, మాణిక్యం, చింతకాయల పుల్లయ్య, జగదీష్, పవన కుమార్, జ్యోతి, నాగలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
