అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన బీజేవైఎం నాయకులు
- అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన బీజేవైఎం నాయకులు - November 2, 2026
- నర్సుల కొరతతో వెల్దండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు - November 2, 2026
- ఢిల్లీ సభకు తెలంగాణ నుంచి 15 వేల మందికి పైగా హాజరు.. ఎమ్మెల్యే కసిరెడ్డి - November 2, 2026

కల్వకుర్తి:భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో కల్వకుర్తి మండలంలోని కురుమిద్ద గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ప్రతిరోజూ గుడ్లు, ఇతర పోషకాహారం సక్రమంగా అందిస్తున్నారా లేదా అనే విషయాలను తనిఖీ చేశారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు పలకలను పంపిణీ చేశారు. చిన్నారులను సొంత పిల్లల్లా ఆప్యాయంగా చూసుకుంటూ, వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు, ఆయాలను బీజేవైఎం నాయకులు శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులుగుర్ల కృష్ణారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు నాప శివసేన కురుమ, గ్రామ వార్డు సభ్యులు చిల్వేర్ రాజు గౌడ్, సైదులు గౌడ్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
