కమాండోల శిక్షణకు OODA షూట్ హౌస్ ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

రాజేంద్రనగర్‌లోని గ్రేహౌండ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ OODA షూట్ హౌస్ (CQB ఫైరింగ్ రేంజ్)ను ప్రారంభించారు. పోలీసు అమరవీరులు సందీప్, పవన్, శ్రీధర్‌ల స్మారకార్థం ఈ శిక్షణ కేంద్రానికి వారి పేర్లను అనుసంధానించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోల గురి, పోరాట సంసిద్ధత పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఫిబ్రవరి 2 నుంచి రాజస్థాన్‌లో జరిగే అఖిల భారత పోలీస్ కమాండో పోటీల్లో నాలుగో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతర కఠోర శిక్షణతో…