గిగ్ వర్కర్ల పోరాటానికి సంఘీభావంగా బైక్ ర్యాలీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పిలుపు మేరకు గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హన్మంత్ రెడ్డి ప్రారంభించగా, 200 మందికి పైగా గిగ్ వర్కర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించి, మెరుగైన పని పరిస్థితులు, భద్రత, సంక్షేమం కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.