ఆదిత్య నగర్‌లో సీసీ రోడ్డు పనుల పరిశీలన

హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. డివిజన్‌లో ప్రజల సమస్యలకు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో హైదర్‌నగర్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ వర్క్ ఇన్‌స్పెక్టర్…