తైక్వాండో గిన్నిస్ రికార్డు సృష్టించిన వెల్దండ వాసి ఎండి జాంగిర్
- సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు - August 11, 2026
- ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి - August 11, 2026
- సాన్జోస్లో క్వాంటమ్స్కేప్ సీఈఓతో భేటీ - August 11, 2026

జ్ఞాన తెలంగాణ కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన ఎండి జాంగిర్ హైదరాబాదులో బ్లాక్ బెల్ట్ మూడవ డాన్ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ చూపించారు. తైక్వాండో క్రీడారంగంలో 35 నిమిషాల పాటు 533 మంది క్రీడాకారుల ప్రదర్శన, 2 వేల నుంచి 3 వేల జంపింగ్ కిక్స్ తో పాటు వివిధ రకాల పంచులు, బ్లాకులు ప్రదర్శించి సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ప్రపంచ స్థాయిలో నిలిచిపోయేలా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన వారిలో జాంగిర్ ఉత్తమ ప్రతిభ కనబరచాడని,గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ సుమన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తైక్వాండో పోటీల్లో వరల్డ్ రికార్డు సాధించారని గ్రౌండ్ మాస్టర్ జయంత్ రెడ్డి తెలిపారు. వరల్డ్ రికార్డు సాధించిన ఎండి జాంగిర్ ను ఎండి ఖలీల్ మాస్టర్, కుమార్ మాస్టర్ లు అభినందించారు.
