Category: జిల్లా వార్తలు

చేవెళ్లలో భయానక రోడ్డు ప్రమాదం,ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీ

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,చేవెళ్ల: చేవెళ్ల మండలం ఖానాపురం గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు మరియు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు...

పటాన్ చెరు రూప కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

పటాన్ చెరు, నవంబర్ 2(జ్ఞాన తెలంగాణ): పారిశ్రామిక వాడలో కలకలం పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని రూప కెమికల్స్‌ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది.క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లతో...

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురితో సహా ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి,నవంబర్ 2: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వేపురి యాదయ్య అనే వ్యక్తి తన భార్య అలివేలు (31), ఇద్దరు కూతుళ్లు అపర్ణ (13), శ్రావణి (10), అలాగే వదిన హనుమమ్మ...

బాలికపై సామూహిక లైంగిక దాడి

జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి,నవంబర్ 02: ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా వెళ్తున్న ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు 16 ఏళ్ల బాలురు కాగా, మరొకరు 18 ఏళ్ల యువకుడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో శుక్రవారం...

ఫకీరాబాద్‌లో మహిళ దారుణ హత్య

– తల, చేయి నరికి నగ్నంగా పారేసిన దుండగులు ఫకీరాబాద్,నవీపేట మండలం,జ్ఞాన తెలంగాణ న్యూస్ : నిజామాబాద్ జిల్లా మరోసారి పాశవిక హత్యకు వేదికైంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనుగొనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాసర ప్రధాన రహదారి సమీపంలో...

చేవెళ్ల నియోజకవర్గంలో పామేన భీమ్ భరత్ సంతాపం

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి : చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వార్త తెలుసుకున్న చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే షాబాద్ మండలం...

మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ దర్బార్ హాలులో ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో అల్లా పేరు మీద ప్రమాణం చేయించారు. కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో...

సిపిఎం నేత సామినేని రామారావు హత్య,కమిషనర్ సునీల్ దత్ పరిశీలన

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,మధిర ప్రతినిధి,అక్టోబర్ 31: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ పరిధిలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రైతు సంఘం నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి...

రామారావు హత్య పై భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం, అక్టోబర్ 31: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు రాజకీయ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క...

మద్దివారిగూడెం నుండి డాక్య తండా రాకపోకల బందు

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,ప్రతినిధి, అక్టోబర్ 29: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం డాక్య తండా నుండి మద్దివారిగూడెం పోయే మార్గం మధ్యలో చెరువు కలుగు పడడంతో మద్దివారిగూడెం కి దామద్దివారిగూడెం కి డాక్య తండా కు రాకపోకల నిలిచిపోయాయికే తండాకి రాకపోకల నిలిచిపోయాయి వల్ల...