ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడులో మాట్లాడిన ఆయన, చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
రాష్ట్రానికి, దేశానికి ఎన్టీఆర్ అందించిన విశేష సేవలను గుర్తిస్తూ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే మహిళలకు ముప్పై మూడు శాతం సీట్ల ప్రకటన చేశామని తెలిపారు.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతాన్ని ఎన్టీఆర్ అందించారని, అదే పార్టీకి మార్గదర్శకంగా కొనసాగుతోందన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని సాధించడం ఎన్టీఆర్కే సాధ్యమైన అరుదైన ఘనత అని కొనియాడారు. సినీ చరిత్రలో ఎన్టీఆర్కు ప్రత్యామ్నాయం లేదని, ఆయన చేసిన పాత్రలు మళ్లీ చేయాలంటే ఆయనే మళ్లీ పుట్టాలని వ్యాఖ్యానించారు.
