కర్ణాటకలో కీలక మార్పు.. సిద్ధరామయ్య రాజీనామా
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో జరిగిన కీలక అల్పాహార సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు.
పదవి వదులుకోవడంపై తనకు ఎలాంటి బాధ లేదని సిద్ధరామయ్య తెలిపారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేబినెట్‌ను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు చెప్పారు.
ఈ పరిణామంతో డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్‌లో అధికార మార్పిడికి మార్గం సుగమమైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
