చున్నీతో గొంతునులిమి భార్య హత్య
- చున్నీతో గొంతునులిమి భార్య హత్య - November 13, 2026
- పెట్టుబడులపై కాంగ్రెస్ విష ప్రచారం: కిషన్ రెడ్డి - November 13, 2026
- మాదిగ ఉద్యోగుల ప్రమోషన్లకు వినతి - November 13, 2026

తెలంగాణ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొంగరకలాన్ ఇటుక బట్టీల వద్ద దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉన్నిథి కుమారి (26) అనే వివాహితను ఆమె భర్తే చున్నీతో గొంతునులిమి హత్య చేసినట్లు సమాచారం. భార్యాభర్తలు నాలుగు రోజుల క్రితమే నగరానికి వచ్చి ఇటుక బట్టీల వద్ద నివాసం ఉంటున్నట్లు స్థానికులు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
