చిన్న కంజర్లలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు
- పేదల ఇళ్లపై పాలకుల పంజా.. పోరుకు సిద్ధమైన బాధితులు! - November 9, 2026
- ఆర్ఎస్ఎస్కు సేవకులే బలం! - November 9, 2026
- జనగణనకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్! - November 9, 2026

పఠాన్ చెరు మండలం చిన్న కంజర్లలో గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలసి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, కాటం శ్రీనివాస్,ఇంద్రేశం మున్సిపాలిటీ, చిన్న కంజర్ల 1వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి శ్రీనివాస్,మరియు 18వ వార్డు సభ్యులు భూపాల్ గౌడ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు వద్దకు వెళ్లి నూతన గృహప్రవేశంతో పాటు, నూతన గృహాల్లో దీపావళి పండుగను లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవం, భరోసా కల్పించే చిరునామా అని అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుపేదలకు సంక్షేమ పథకాల ద్వారా చిరునవ్వును నింపడమే ప్రభుత్వ ద్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, దిల్ ఆర్ కృష్ణ, నాగభూషణం, డీలర్లు, గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
