రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు సాగు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా, ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు తగ్గి, ఎండలు తీవ్రంగా ఉండే అవకాశమున్నందున రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో నిర్వహించిన మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. వచ్చే ఎనిమిది నెలలు అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాళేశ్వరం, గోదావరి, కృష్ణా జలాల పరిస్థితులపై డిసెంబర్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమగ్రంగా చర్చిస్తామని వెల్లడించారు. ఎల్నినో సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
