సదర్ ఉత్సవానికి వేరే రామచంద్ర యాదవ్ కు ఆహ్వానం

సదర్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా బేరి రామచందర్ యాదవ్‌కు ఆహ్వానం

హైదరాబాద్,  రాయదుర్గం యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదర్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్‌ను గోకుల్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దానబోయిన రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి నాగపురి అశోక్ యాదవ్, నాగపురి శ్యామ్ యాదవ్, దానబోయిన దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ మహోత్సవానికి ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వల్లాల నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మారబోయిన బిక్షపతి యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, యాదవ సంఘాల నాయకులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. గత 60 సంవత్సరాలుగా రాయదుర్గం యాదవ సంఘం పెద్దలు సంప్రదాయబద్ధంగా సదర్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సదర్ పండుగ యాదవుల ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. పాడి పశువులను పూజిస్తూ, దున్నపోతుల ప్రదర్శనలు, డోలు సన్నాయి మేళాలు, కళాకారుల ప్రదర్శనలతో నిర్వహించే ఈ వేడుక తెలంగాణ సంస్కృతికి నిదర్శనమన్నారు. ప్రజాప్రతినిధులు, యాదవ బంధువులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

You may also like...