వర్షం లేకున్నా నిలిచే నీరు.. జీహెచ్ఎంసీ నిద్ర నటిస్తోందా?
- పండుగ వేళ పారిశుద్ధ్య కార్మికులకు ఘన గౌరవం - November 7, 2026
- వర్షం లేకున్నా నిలిచే నీరు.. జీహెచ్ఎంసీ నిద్ర నటిస్తోందా? - November 7, 2026
- హెచ్చరికలు శూన్యం, తవ్వకాలు ఇష్టారాజ్యం, నరకప్రాయంగా ఐటీ రోడ్లు. - November 7, 2026

బండ్లగూడ: బండ్లగూడ గ్రామపంచాయతీ ప్రధాన రహదారిపై గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన నీటి నిల్వలు, గుంతల సమస్య స్థానికులకు నరకంగా మారింది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా, అన్ని కాలాల్లోనూ ఇక్కడ నిత్యం నీరు నిలిచి ఉండటంతో రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా తయారైంది. భూగర్భ పైప్‌లైన్ల లీకేజీ వల్లే ఈ సమస్య తలెత్తుతోందా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారి గుండా ప్రతిరోజూ వేలాది మంది వాహనదారులు, ఉద్యోగులతో పాటు పెద్ద సంఖ్యలో స్కూల్ పిల్లలు రాకపోకలు సాగిస్తుంటారు. ద్విచక్ర వాహనాలు, కార్లు వెళ్లేటప్పుడు రోడ్డుపై ఉన్న మురికి నీరు ఎగిరి పడటంతో, స్కూలుకు వెళ్లే చిన్న పిల్లల వైట్ డ్రెస్సులు పాడైపోతున్నాయని.. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టూ వీలర్ వాహనదారులు ఇక్కడ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
ఎన్ని సంవత్సరాల నుండి ఈ సమస్య వేధిస్తున్నా, జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు మాత్రం కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి, ఇక్కడ నీరు నిలవడానికి గల కారణాలను గుర్తించి, ఈ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని బండ్లగూడ నివాసితులు డిమాండ్ చేస్తున్నారు.
