రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) 
కోటి దీపోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత
కుత్బుల్లాపూర్,
గాజులరామారం డివిజన్లో నిర్వహించనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి గారికి నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆహ్వానించారు. సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు భక్తిభావాన్ని, సామాజిక ఐక్యతను చాటిచెబుతాయని పేర్కొన్నారు.