మృతుడి కుటుంబానికి సర్పంచ్, మాజీ ఎంపీటీసీ ఆర్థిక చేయూత

1001334103.jpg

వెవల్దండ నవంబర్ 06: మండల పరిధిలోని చెరుకూరు గ్రామానికి చెందిన నుకం కృష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ భీమయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అనంతరం కుటుంబానికి రూ.7,000 ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పురుగుల లాలయ్య, పురుగుల రమేష్, దాసరి రమేష్, గొర్రె జంగయ్య, రాజు, జాజాల రామచంద్రయ్య, సాయిలు, పురుగుల శ్రీను, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...