రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర ప్రసూతి సేవలు, శస్త్రచికిత్స సదుపాయాలు, రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్యంపై ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మాతృ మరణాల సమీక్షలో గుర్తించిన లోపాలను నిర్దిష్ట గడువులోగా సరిదిద్దాలని స్పష్టం చేశారు. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. వెంకటి, వైద్య నిపుణులు, పీహెచ్‌సీల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.