కొట్రలో ఆరు నెలలుగా మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకేజీ

1001324890.jpg

వెల్దండ నవంబర్ 03: వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో మిషన్‌ భగీరథ తాగునీటి పైపులైన్‌ దెబ్బతినడంతో గత ఆరు నెలలుగా నీరు లీకవుతోంది. పైపులైన్‌ మరమ్మతుల కోసం సంబంధిత అధికారులకు పలుమార్లు సమాచారం అందించినట్లు గ్రామస్థులు తెలిపారు.పైపులైన్‌ నుంచి వెలువడుతున్న నీరు సమీపంలోని వరి పొలంలోకి చేరుతుండటంతో పంట సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు పేర్కొన్నారు.ఒకవైపు వేసవి, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దెబ్బతిన్న పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు,రైతులు కోరుతున్నారు.

You may also like...